తెలంగాణ

telangana

ETV Bharat / state

బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన మంత్రి ఈశ్వర్​ - బాలికల వసతి గృహా

జగిత్యాలలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో ప్రమాదవశాత్తు గ్యాస్​ సిలిండర్​ పేలింది. సంఘటనా స్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్​ పరిశీలించారు.

బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన మంత్రి ఈశ్వర్

By

Published : Aug 20, 2019, 1:26 PM IST

జగిత్యాలలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో వంట చేస్తుండగా గ్యాస్​ సిలిండర్ పేలింది. భారీగా మంటలు చెలరేగడంతో అగ్ని మాపక సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఒక్కసారిగా శబ్ధం రావటంతో వసతి గృహంలోని విద్యార్థునులు భయాందోళనకు గురయ్యారు. సంఘటనా స్థలాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. అధికారులను అడిగి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. వసతి గృహం, పాఠశాల రెండూ ఒకే భవనంలో ఉండటం వల్ల ఇరుకుగా ఉందని విద్యార్థినులు మంత్రికి వివవరించారు.

బాలికల వసతి గృహాన్ని పరిశీలించిన మంత్రి ఈశ్వర్

ABOUT THE AUTHOR

...view details