HarishRao Laid Foundation Stone 30bed Hospital in Mettupalli: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను వైద్య రంగంలో దేశంలోనే ముందంజలో ఉంచారని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. జగిత్యాలలోని కోరుట్లలో 100 పడకల ఆసుపత్రి, డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి మెట్‌పల్లిలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందించటంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్న మంత్రి కేంద్రంపై పలు విమర్శలు చేశారు. జన్‌ధన్ ఖాతాల్లో డబ్బులు, ఏడాదికి కోట్ల ఉద్యోగాలిస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
ఏడాదికి కోట్ల ఉద్యోగాలు ఇస్తామని కేంద్రం ఇచ్చిన హామీ ఎటుపోయింది: హరీశ్‌రావు
Minister HarishRao visited Jagityala district: జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పర్యటించారు. మెట్టుపల్లిలో 30 పడకల ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్‌తో పాటు బస్తీ ఆసుపత్రిని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రారంభించారు.
Minister HarishRao visited Jagityala district
మన ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుట్ల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేయటం జరిగింది. ఇవాళ ఆ 100 పడకల ఆసుపత్రికి 20కోట్ల నిధులు సెంక్షన్ చేసి ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇప్పటిదాకా కోరుట్లలో 30 పడకల ఆసుపత్రి ఉండేది. 20 కోట్ల నిధులతో కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా ఇవాళ శంకుస్థాపన చేశాం. -హరీశ్‌రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇవీ చదవండి:
Last Updated : Jan 5, 2023, 5:01 PM IST