తెలంగాణ

telangana

ETV Bharat / state

చిరుధాన్యాలతో అల్పాహారం.. క్యూ కడుతున్న భోజనప్రియులు - millet breakfast

ఆరోగ్యానికి సిరులవంటివి.. చిరు ధాన్యాలు. వీటిని సిరి ధాన్యాలని కూడా అంటారు. మంచి ఆరోగ్యాన్నిచ్చే వీటితో రుచికరమైన అల్పాహారం తయారు చేస్తున్నాడు ఓ యువకుడు. కనుమరుగైన ఈ పాత కాలపు ఉత్పత్తులతో అల్పాహారం రుచిగా ఉన్నందున ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఆ ఆసక్తిని ఉపాధిగా మార్చుకున్నాడు జగిత్యాల జిల్లాకు చెందిన యువకుడు.

millet breakfast in jagtial
జగిత్యాలలో చిరుధాన్యాలతో అల్పాహారం

By

Published : Dec 26, 2019, 4:33 PM IST

Updated : Dec 27, 2019, 9:38 AM IST

చిరుధాన్యాలతో అల్పాహారం.. క్యూ కడుతున్న భోజనప్రియులు
కనుమరుగైన ఈ పాత కాలపు చిరు ధాన్యాలతో ఓ యువకుడు నోరూరించే అల్పాహారం తయారు చేస్తున్నాడు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నంకు చెందిన కొలగాని జలందర్‌.. అతని భార్య హరితతో కలిసి జగిత్యాలలో ఓ ఇడ్లీ సెంటర్​ను ఏర్పాటు చేశాడు.

పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపం సమీపంలో పాత కాలపు ఉత్పత్తులైన కొర్రలు, అరికలు, సామలు, ఊదలు, రాగులతో అల్పాహారం అందిస్తున్నాడు. వేరే చోట్ల వీటి ధర ఎక్కువ ఉంటుందని.. ఇక్కడ 25 రూపాయలకే అందిస్తున్నామని జలందర్​ తెలిపాడు.

ఇవి రుచికరంగా ఉండటమే కాక మంచి ఆరోగ్యాన్ని కలిగించే చిరు ధాన్యాలు కావడం వల్ల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. నిత్యం ఒకే రకమైన టిఫిన్​ తినే వారికి కొత్తదనమైన అల్పాహారం దొరుకుతున్నందున క్యూ కడుతున్నారు.

సొంతగా నిర్వాహకులే వంటకాలు చేయడం.. రుచిగా ఉండటం వల్ల వినియోగదారులు కూడా చాలా బాగుందంటున్నారు. నిత్యం రద్దీగా ఉండే కరీంనగర్​ రహదారి పక్కనే ఉన్నందున ఈ మొబైల్​ టిఫిన్​ సెంటర్​ వద్ద అల్పాహారం ఆరగించి వెళ్తున్నారు. వినియోగదారులు పెరిగితే మరిన్ని వంటకాలు ఏర్పాటు చేస్తామని నిర్వాహకులు అంటున్నారు.

Last Updated : Dec 27, 2019, 9:38 AM IST

ABOUT THE AUTHOR

...view details