మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండల రైతులు రోడ్డెక్కారు. రాజేశ్వర రావు పేట వద్ద గల జాతీయ రహదారిపై మేడిపల్లి, బండలింగాపూర్, రాజేశ్వరరావుపేట, సత్తక్కపల్లి గ్రామ రైతులు తరలివచ్చి ఆందోళన నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి... ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
మొక్కజొన్న పంట చేతికచ్చి నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని వాపోయారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత మూడు రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాలతో చేతికొచ్చిన మొక్కజొన్న మొలకలు వస్తు నష్టాన్ని తెచ్చిపెడుతున్నాయని తెలిపారు. రైతుల బాధలను ప్రభుత్వం వెంటనే గుర్తించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని వేడుకున్నారు.