తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ప్రయాణ ప్రాంగణంలో ప్రాణానికి గండం - మెట్​పల్లి

గమ్యానికి చేరేందుకు వచ్చే ప్రయాణికులను మెట్​పల్లి ఆర్టీసీ బస్టాండ్​ భయపెడుతోంది. శిథిలావస్థలో కొట్టుమిట్టాడుతూ ఎప్పుడేం జరుగుతుందోననే భయాన్ని కలిగిస్తోంది. నిత్యం వివిధ గ్రామాల నుంచి వచ్చే వేలాది మంది ప్రయాణికులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని అవస్థలు పడుతున్నారు.

ఆ ప్రయాణ ప్రాంగణంలో ప్రాణానికి గండం

By

Published : Aug 1, 2019, 4:04 PM IST

Updated : Aug 1, 2019, 5:18 PM IST

ఆ ప్రయాణ ప్రాంగణంలో ప్రాణానికి గండం

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ఆర్టీసీ బస్టాండ్‌ ఐదు ప్లాట్‌ఫామ్​లను కలిగి ఉంది. ప్రతిరోజు వేలాది మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్టీసీని నమ్ముకుని బస్సుల కోసం బస్టాండ్‌కు వస్తున్నారు. నిత్యం వచ్చిపోయే ప్రయాణికులకు ప్లాట్​ఫామ్​లు సరిపోక బస్టాండ్​ బయట నిలబడుతు ఇబ్బందులు పడుతున్నారు.

ప్రాణాలకు ఏది భరోసా

ఆర్టీసీని నమ్ముకుని బస్టాండ్‌కు వచ్చే ప్రయాణికుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుంది. బస్టాండ్‌ పూర్తిగా శిథిలావస్థలోకి చేరి తరచూ పైకప్పు పెచ్చులూడుతున్నాయి. మూడేళ్ల క్రితం బస్టాండ్​లోని నిజామాబాద్‌ ఫ్లాట్‌ఫాం వద్ద పెచ్చులు ఊడి ఏడుగురు ప్రయాణికులు గాయాల పాలయ్యారు.

మళ్లీ అక్కడే

మూడ్రోజుల నుంచి కురిసిన వర్షాలకు మళ్లీ ఇదే ఫ్లాట్‌ ఫాం వద్ద పెచ్చులూడాయి. ఆ సమయంలో అక్కడెవరూ లేకపోవడం వల్ల ప్రమాదం తప్పింది. బస్టాండ్‌లోని దుకాణ సముదాయాలు, హోటళ్లలో పెచ్చులు ఊడి ఇనుపచువ్వలు బయటకు వచ్చాయి. పైకప్పు ఎప్పుడు కూలుతుందోనని ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఆవరణా అంతే

బస్టాండే ఇలా ఉంటే ఆవరణ మరీ అధ్వాన్నంగా తయారైంది. ఎటు చూసినా గుంతలు, వాటిలో నిండిన నీటితో నడవడానికి నరకప్రాయంగా మారింది. మూత్రశాలలు శుభ్రం చేయకపోవడం వల్ల దుర్వాసనతో ప్రయాణికులు నానాఅవస్థలు పడుతున్నారు. పందుల సంచారంతో బస్టాండ్​లో దోమల బెడద తీవ్రంగా మారింది.

వారికీ ఇబ్బందే

మురుగుకాల్వలు సరిగా లేక హోటళ్లలోని మురుగునీరంతా రోడ్డుపై పారుతూ అవస్థలు తెచ్చి పెడుతోంది. బస్టాండ్​కు వచ్చే ప్రయాణికులకే కాక, చుట్టుపక్కల ఉన్న స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని బస్టాండ్‌కు పూర్తి మరమ్మతులు చేయాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.

Last Updated : Aug 1, 2019, 5:18 PM IST

ABOUT THE AUTHOR

...view details