తెలంగాణ

telangana

ETV Bharat / state

మెట్​పల్లిలో పోలింగ్ ప్రారంభం... క్యూ కట్టిన ఓటర్లు - ennikalu

జగిత్యాల జిల్లా మెట్​పల్లి డివిజన్​లో రెండో విడత పోలింగ్ ప్రారంభమైంది. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఉదయమే ఓటేసేందుకు కేంద్రాలకు తరలివస్తున్నారు.

మెట్​పల్లిలో పోలింగ్ ప్రారంభం

By

Published : May 10, 2019, 10:39 AM IST

జగిత్యాల జిల్లా మెట్​పల్లి డివిజన్​ పరిధిలోని 6 మండలాల్లో 81 ఎంపీటీసీ, 6 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా... 5 ఎంపీటీసీ ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 76 స్థానాలకు 255 మంది, 6 జడ్పీటీసీ స్థానాలకు 26 మంది పోటీలో ఉన్నారు. మెట్​పల్లి డివిజన్​లో 2 లక్షల 4 వేల 122 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అధికార, పోలీసు యంత్రాంగం తీవ్ర కసరత్తు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున... ఓటర్లు ఉదయమే పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్నారు.

మెట్​పల్లిలో పోలింగ్ ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details