ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు. అంతేకాదు పక్కనే ఉన్న మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి... భక్తి శ్రద్ధలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఘనంగా మల్లన్న జాతర... కిక్కిరిసిన ఆలయం - ఘనంగా మల్లన్న జాతర... కిక్కిరిసిన ఆలయం
జగిత్యాల జిల్లాలో మల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు. సుమారు 30వేల మంది స్వామికి బోనాలు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఘనంగా మల్లన్న జాతర... కిక్కిరిసిన ఆలయం
ఆలయ ప్రాంగణంలోకి భక్తులంతా... బోనాలు ఎత్తుకుని రాగా ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. భారీగా భక్తులు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
ఇవీ చూడండి: నెలరోజులుగా ముప్పుతిప్పలు పెడుతోన్న చిరుత