తెలంగాణ

telangana

ETV Bharat / state

స్వశక్తితో ముందుకు... మహిళల సక్సెస్ స్టోరీ - ఉపాధి

ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడలేదు అక్కడి మహిళలు. తమకు నచ్చిన రంగాలను ఎంచుకుని దూసుకెళ్తున్నారు. ఇంటి వద్దే ఉపాధి పొందుతూ ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వారి గురించి తెలుసుకుందాం..

ఉపాధి పొందుతున్న మహిళలు

By

Published : Mar 8, 2019, 8:43 PM IST

ఉపాధి పొందుతున్న మహిళలు
జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మెప్మా అధికారులు అతివలకు భరోసాగా నిలుస్తున్నారు. అక్కడి 24 వార్డులలోని మహిళలను ఏకం చేసి సంఘాలను ఏర్పాటు చేశారు. సభ్యులు తమకు నచ్చిన వృత్తి చేపట్టేందుకు కావాల్సిన రుణాలను అందించి వారికి ఆదాయ మార్గాలను చూపుతున్నారు.

పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో మొత్తం 860 సంఘాలనుగుర్తించారు. ఒక్కొక్క బృందంలో 12 నుంచి 15 మంది సభ్యులను చేర్చారు. సుమారు 8,200 మంది వనితలను సంఘంలో సభ్యులుగా కొనసాగిస్తున్నారు. రుణం తీసుకున్న సంఘాల సభ్యులు వాటిని సమానంగా పంపిణీ చేసుకుని.. నచ్చిన వృత్తులను ఎంచుకుని ఇంటివద్దే ఉపాధిని పొందుతున్నారు.

కొందరు పేపర్‌ ప్లేట్లను, మరికొందరు బుట్టలు అల్లుతూ, కుట్టు మిషన్ల ద్వారా, క్యాటరింగ్ చేస్తూ, పిండి వంటలు చేస్తూ... ఇలా వారికి నచ్చిన పనిని చేసి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. కొంతమంది తాము ఉపాధి పొందుతూనే... మరింత మందికి పని కల్పిస్తూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు.

ఇవీ చదవండి:'తల్లిదండ్రుల పాత్రే కీలకం'

ABOUT THE AUTHOR

...view details