జగిత్యాల జిల్లాలో గాంధీ జయంతిని ప్రజా ప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. కలెక్టరేట్‌లో బాపూజీ చిత్రపటానికి కలెక్టర్ గుగులోతు రవి, జిల్లా పరిషత్ కార్యాలయంలో మహాత్ముడి చిత్రపటానికి జడ్పీ అధ్యక్షురాలు దావ వసంత పూలమాల వేసి నివాళులర్పించారు.
జగిత్యాల పట్టణంలోని గాంధీనగర్, మంచినీళ్ల సమీపంలోని బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయం, ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీల్లో గాంధీ జయంతిని నిర్వహించారు.