జగిత్యాల జిల్లాలో ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. ఉదయం 10 గంటల తర్వాత వచ్చే వాహనాలు సీజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ పరిస్థితిని వరంగల్ రేంజ్ ఐజీ ప్రమోద్‌కుమార్ పరిశీలించారు. జిల్లాలోని పరిస్థితిని ఎస్పీ సింధూశర్మను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 10 లోపే కార్యాలయాలకు చేరుకోవాలని కోరారు.
జగిత్యాల జిల్లాలో కఠినంగా లాక్‌డౌన్ అమలు - jagtial district news
జగిత్యాల జిల్లాలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత బయటకొస్తున్న వాహనదారులను అడ్డుకుని వాహనాలు సీజ్ చేస్తున్నారు. ప్రజలంతా లాక్‌డౌన్ నిబంధనలు పాటించి.. ఇంట్లోనే ఉండాలని ఎస్పీ సింధూశర్మ సూచించారు.
తెలంగాణ వార్తలు, తెలంగాణ లాక్‌డౌన్, జగిత్యాల జిల్లాలో లాక్‌డౌన్
లాక్‌డౌన్ ఉల్లంఘనకు పాల్పడ్డవారిపై 4వేల 2 వందల 31 కేసులు నమోదు చేశామని తెలిపారు. మాస్కు ధరించకుండా తిరుగుతున్న వారిని గుర్తించి చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 990 వాహనాలు సీజ్ చేశామని వెల్లడించారు. లాక్‌డౌన్ సమయంలో ప్రజలంతా ఇంట్లోనే ఉండాలని ఆయన సూచించారు.
- ఇదీ చదవండిజగిత్యాలలో బ్లాక్ ఫంగస్‌తో ఇద్దరు మృతి