తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇబ్రహీంపట్నంలో లాక్‌డౌన్.. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా - తెలంగాణ వార్తలు

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నంలో లాక్‌డౌన్ విధించారు. ఉదయం 6 నుంచి 11గంటల వరకే దుకాణాలు తెరిచి ఉంటాయని పంచాయతీ పాలకవర్గం వెల్లడించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించింది.

ibrahimpatnam lockdown, ibrahimpatnam mandal
ఇబ్రహీంపట్నంలో లాక్‌డౌన్, ఇబ్రహీంపట్నంలో కరోనా కేసులు

By

Published : Apr 6, 2021, 3:09 PM IST

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతుండడంతో గ్రామపంచాయతీ పాలకవర్గం లాక్‌డౌన్ విధించింది. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే నిత్యావసర సరుకుల కోసం దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొంది. మిగతా సమయాల్లో అన్నీ మూసేయాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.1,000 జరిమానా విధించాలని పాలక వర్గం నిర్ణయించింది. బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

నిర్మానుష్యంగా రహదారులు

కరోనా సోకిన ఇద్దరు వృద్ధుల్లో ఒకరు సోమవారం, మరొకరు మంగళవారం మృతి చెందారు. బయటకు రావాలంటేనే ప్రజలు జంకుతున్నారు. లాక్‌డౌన్ ప్రభావంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

ఇదీ చదవండి:వాటర్ బాటిల్ తెచ్చుకుంటానని చెప్పి భార్య పరార్​.!

ABOUT THE AUTHOR

...view details