హృద్రోగ వ్యాధితో బాధపడుతున్న ఎంతో మంది చిన్నారులకు ప్రాణాలు పోసిన వైద్యుడు అతను. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 60వేల మంది పిల్లలకు ఉచితంగా వైద్యసేవలు అందించడమే కాకుండా, గుండె శస్త్రచికిత్సలు ఉచితంగా చేసి వేలాది మంది చిన్నారులకు ప్రాణం పోశారు. అతనే జగిత్యాలకు చెందిన వైద్యులు రమణ దన్నపునేని. లండన్‌లో స్థిరపడ్డ అతను దశాబ్దానికి పైగా చిన్న పిల్లలకు గుండె శస్త్రచికిత్సలు చేస్తున్నారు. లండన్‌లోని చిల్డ్రన్స్ ఆసుపత్రిలో వైద్యునిగా సేవలు అందిస్తున్న రమణ... మన దేశంలోనూ ఉచిత శస్త్రచికిత్సలు చేస్తున్నారు. విజయవాడ, పూణె, శ్రీనగర్, గుజరాత్, కరీంనగర్‌లోనూ ప్రతి ఏటా ఉచితంగా శస్త్రచికిత్సలు చేస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన బ్రిటీష్ హార్ట్ పౌండేషన్ 2019 సంవత్సరానికి గాను హెల్త్‌కేర్ అవార్డు రమణకు ప్రదానం చేసింది. వచ్చే నెలలో ఆయన స్వదేశానికి రానున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఎందరో చిన్నారులకు ప్రాణదాత..
అతడు వేలాది మందికి వైద్య సేవలు అందించాడు... అదీ ఉచితంగా. ఎంతో మంది చిన్నారులకు శస్త్ర చికిత్సలు చేసి ప్రాణాలు పోశాడు. అతని సేవలకు గుర్తింపుగా ఓ అరుదైన గౌరవం అతన్ని వరించింది.
ఎందరో చిన్నారులకు ప్రాణదాత..