తెలంగాణ

telangana

ETV Bharat / state

భారీ అగ్నిప్రమాదాలు సంభవిస్తే అగమ్యగోచరమే.. - సిబ్బంది కొరత

ఆ అగ్నిమాపక కార్యాలయంలో ఉండాల్సిన సిబ్బంది 18 మంది. విధుల్లో ఉన్నది  మాత్రం ఐదుగురే. ఒకేసారి రెండు భారీ ప్రమాదాలు జరిగితే నిస్సహాయంగా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి. ఇదీ జగిత్యాల జిల్లా మెట్​పల్లి డివిజన్​లోని అగ్నిమాపక కేంద్ర దుస్థితి.

అగ్నిమాపక కార్యాలయం

By

Published : Mar 24, 2019, 3:17 PM IST

సిబ్బంది లేక సతమవుతున్న మెట్​పల్లి అగ్నిమాపక కార్యాలయం ఉద్యోగులు
వేసవికాలంలో ఎప్పుడు, ఎక్కడ అగ్నిప్రమాదాలు సంభవిస్తాయో తెలియని పరిస్థితి. అగ్నిమాపక అధికారులు అందుకు... నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. మంటలార్పడానికి అగ్నిమాపక వాహనంతో పాటు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. జగిత్యాల జిల్లా మెట్​పల్లి అగ్నిమాపక కేంద్రంలో మాత్రం ఐదుగురు ఉద్యోగులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. చుట్టు పక్కల ఐదు మండలాలకు ఒకటే కార్యాలయం ఉండడం వల్ల ఒకేసారి రెండు ప్రమాదాలు జరిగితే నివారించడం సాధ్యం కాని దుస్థితి నెలకొంది.

సిబ్బందికి పనిభారం

కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్​, కథలాపూర్​, మేడిపల్లి మండలాల్లో అగ్నిప్రమాదాలు జరిగితే మెట్​పల్లి డివిజన్​ కార్యాలయాన్నే సంప్రదించాలి. సిబ్బంది కొరతతో పనిభారం పెరిగి ఉన్న ఐదుగురు ఉద్యోగులు అవస్థలు పడుతున్నారు. వారిలోనూ ఇద్దరు ఫైర్​మెన్లు మాత్రమే ఉండడం వల్ల భారీ ప్రమాదాలు జరిగితే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు.

అవగాహన కార్యక్రమాలు గగనమే

ఉద్యోగుల లేమితో అగ్నిప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో జాప్యం జరుగుతోంది. నలుగురు డెఫ్యుటేషన్​పై వెళ్లడం వల్ల సమస్య ఏర్పడిందని సిబ్బంది చెబుతున్నారు.

వేసవి తీవ్రతను గుర్తించి మెట్​పల్లి కేంద్రంలో ఉద్యోగుల సంఖ్య పెంచాలని అటు సిబ్బంది, ఇటు స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి :నిజాంపేట్​లో ఇంజినీరింగ్ కళాశాల బస్సు బీభత్సం

ABOUT THE AUTHOR

...view details