ఖమ్మం జిల్లా గార్ల మండలం బుద్దారానికి చెందిన తొమ్మిది మంది సభ్యులు రెండు నెలల క్రితం జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం ధమ్మన్నపేటకు వచ్చారు. ఇక్కడ రహదారి నిర్మాణ పనులు చేస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం వల్ల సొంత గ్రామానికి వెళ్లే వీలు లేక పది రోజులుగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
మంత్రి కేటీఆర్ చొరవతో సొంతూరుకు కూలీలు - it minister ktr
లాక్ డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వలస కూలీలు సొంతూరు వెళ్లేందుకు మంత్రి కేటీఆర్ సహకరించారు. కూలీల బాధను ప్రేరణ యూత్ సభ్యులు ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన మంత్రి కొప్పులతో మాట్లాడి కూలీలకు అనుమతి పత్రాలు ఇప్పించారు.
కేటీఆర్ చొరవతో సొంతూరు చేరుకున్న కూలీలు
గ్రామానికి చెందిన ప్రేరణ యూత్ సభ్యులు వలసకూలీల పరిస్థితిని ట్విట్టర్ ద్వారా కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన మంత్రి కేటీఆర్.. సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో మాట్లాడారు. మంత్రి కొప్పుల కూలీలు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి పత్రాలు ఇవ్వాలని ధర్మపురి పోలీసులను ఆదేశించారు. ఆదివారం కుటుంబాలు సొంతూరుకు వెళ్లిపోయాయి.
ఇదీ చదవండి:కరోనాపై పోరాటానికి విరాళాల వెల్లువ