తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ కృషిని చూసే గెలిపించారు: కోరుట్ల ఎమ్మెల్యే - సహకార ఎన్నికలు

సీఎం కేసీఆర్​ చేస్తున్న కృషిని చూసే రైతు ఓటర్లు తెరాస బలపరిచిన అభ్యర్థులను గెలిపించారని కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు అన్నారు. ఓటేసి గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు.

korutla-mla-kalvakuntla-vidyasagar-rao-spoke-on-pacs-elections-in-jagitial-district
కేసీఆర్​ కృషిని చూసే గెలిపించారు: కోరుట్ల ఎమ్మెల్యే

By

Published : Feb 15, 2020, 7:08 PM IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు చేస్తున్న కృషిని చూసి రైతు ఓటర్లు తెరాస బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావు అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్​పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో జరిగిన ఎన్నికల్లో తెరాస బలపరిచిన అభ్యర్థులే ఎక్కువగా గెలిచారని వెల్లడించారు. ఈ సందర్భంగా ఓటేసి గెలిపించిన ఓటర్లకు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం గిరిజన అభ్యర్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. రానున్న రోజుల్లో రైతులకు మరిన్ని మంచి రోజులు వస్తున్నాయని ఎమ్మెల్యే చెప్పారు.

కేసీఆర్​ కృషిని చూసే గెలిపించారు: కోరుట్ల ఎమ్మెల్యే

ABOUT THE AUTHOR

...view details