ఉద్యమం నుంచి కేసీఆర్‌కు అన్నివేళల్లో తోడుగా నిలిచిన కొప్పుల ఈశ్వర్‌కు కేసీఆర్ కేబినెట్లో తొలిసారి చోటుదక్కింది.
మంత్రి కొప్పుల ఈశ్వర్
By
Published : Feb 19, 2019, 1:25 PM IST
మంత్రి కొప్పుల ఈశ్వర్
ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచిన నేత కొప్పుల ఈశ్వర్. 2004లో తొలిసారి శాసనసభలో కాలుమోపిన కొప్పుల.. వరుసగా ఆరుసార్లు విజయం సాధించారు. గతసారే మంత్రి పదవి లేదా స్పీకర్ కుర్చీ ఏదో ఒకటి వస్తుందని ఆశించారు. చివరకు చీఫ్ విప్ పదవితో సరిపెట్టుకున్నారు. పార్టీలో వివాద రహితుడిగా పేరున్న నేత కావటం విశేషం.