తెలంగాణ

telangana

ETV Bharat / state

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేసిన మంత్రి కొప్పుల

జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. దరఖాస్తుదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని మంత్రి సూచించారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేసిన మంత్రి కొప్పుల

By

Published : Jun 23, 2019, 12:01 AM IST

కల్యాణ లక్ష్మి, సీఎం సహాయనిధి మంజూరులో దరఖాస్తుదారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దరఖాస్తుదారులకు సూచించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండల కేంద్రంలో కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు. 85 మంది లబ్ధిదారులకు 77 లక్షల 66 వేల విలువగల చెక్కులను పంపిణీ చేశారు. రెవెన్యూ శాఖ ద్వారా దరఖాస్తుదారుల సమాచారాన్ని పోలీసులకు అందిస్తామని చెప్పారు. దరఖాస్తుదారులతో మాట్లాడి చెక్కులు ఇప్పిస్తామని చెప్పి కమీషన్లు దండుకునే మధ్యవర్తులపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.

కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణి చేసిన మంత్రి కొప్పుల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details