జగిత్యాలలో ఏకగ్రీవం కానున్న జడ్పీ, కోఆప్షన్ పదవులు - nomination
జగిత్యాలలో జడ్పీ ఎన్నిక ప్రారంభమైంది. జడ్పీ, కో ఆప్షన్ సభ్యునిగా ఒక్కొక్కరే నామినేషన్ వేయడం వల్ల అక్కడ పదవులు ఏకగ్రీవం కానున్నాయి.
జగిత్యాల జడ్పీ సభ్యునిగా మాల్యాల మండలం ఓగులపూర్కు చెందిన సుబాన్ నామినేషన్ దాఖలు చేశారు. గొల్లపెళ్లి మండలం చిల్వాకోడూర్కు చెందిన సలీం పాషా కో ఆప్షన్ సభ్యునిగా నామపత్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు రెండు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. మధ్యాహ్నం మూడు గంటలకు జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు కు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు జరుపుతారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జడ్పీ ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.