మహబూబ్‌నగర్‌కు చెందిన ముంతాజ్ జగిత్యాలో భిక్షాటన చేసుకుంటూ జీవించేది. అనారోగ్యం బారిన పడి ఆమె ఈ రోజు ఉదయం మృతి చెందింది. యాచకురాలు కావడం వల్ల అంత్యక్రియలకు ఎవరూ ముందుకు రాలేదు. విషయం తెలుసుకున్న స్థానిక మెకానిక్‌లు తల కొంత డబ్బు వేసుకుని అంత్యక్రియలకు రూ.6వేలు అందించారు. నిరుపేద యాచకురాలు అంత్యక్రియలకు ముందుకు వచ్చిన మెకానిక్ యూనియన్ సభ్యులను పలువురు అభినందించారు.
మానవత్వం చాటుకున్న స్థానిక మెకానిక్‌లు - humanity
వారికి కోట్ల ఆస్తులు లేవు. నెల ముగియగానే జీతం వచ్చే ఉద్యోగులూ కాదు. కానీ వారికి మానత్వం అనే గొప్ప సంపద ఉంది. ఇతరులకు సాయం చేయడమనే గొప్ప ఆస్తి ఉంది. అందుకే యాచన చేసుకునే మహిళా చనిపోతే అంత్యక్రియలకు తమకు ఉన్నదాట్లో డబ్బులు ఇచ్చారు జగిత్యాల మెకానిక్‌లు.
డబ్బులిస్తున్నమెకానిక్లు