రైతులను ఆదుకోండి: జీవన్‌రెడ్డి - THE FORMERS
తృణధాన్యాల రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా... కేసీఆర్ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రజావాణిలో రైతులతో కలిసి అధికారులను ప్రశ్నించారు.
కర్షకుల సమస్యలు పరిష్కరించండి
రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఆరోపించారు. జగిత్యాలలో నిర్వహించిన ప్రజా వాణిలో రైతుల సమస్యలు పరిష్కరించాలని అధికారులకు వినతి పత్రం అందజేశారు. జిల్లాలో కందులు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయకుండానే కేంద్రాన్ని ఎత్తి వేశారన్నారు. పసుపు రైతులకు పదివేల రూపాయల మద్దతు ధర అందించాలని ప్రభుత్వాన్ని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.