జగిత్యాలలో ఐదేళ్ల చిన్నారిపై ఇంటర్ చదువుతున్న బంధువే అత్యాచారానికి పాల్పడ్డారని ... బాధితురాలి తల్లి ఫిర్యాదుచేసినట్లు ఎస్పీ సింధూ శర్మ వెల్లడించారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుందని.. బాధితుల ఫిర్యాదుతో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి నిందితున్ని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు.
ఇంట్లో టీవీ చూసేందుకు వెళ్లి.. చిన్నారిపై అత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు ఫిర్యాదుచేశారన్నారు. నిందితునిపై ఐపీసీ సెక్షన్ 448, 376(ఏ)(బీ), పోక్సో చట్టం 2012 ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. నిందితునికి 20 ఏళ్ల పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు. బాధితురాలిని వైద్య పరీక్షలకు పంపామన్నారు.