తెలంగాణ

telangana

ఉదయం 10 దాటిన తర్వాత బయటకొస్తే కఠిన చర్యలు

By

Published : May 25, 2021, 1:45 PM IST

జగిత్యాల జిల్లాలో లాక్​డౌన్​ పద్నాలుగో రోజును పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపైకి వచ్చిన వారిని హెచ్చరిస్తూ వాహనాలు జప్తు చేస్తున్నారు.

jagtial lock down, metpalli lock down, korutla lock down
జగిత్యాలలో లాక్​డౌన్, కోరుట్లలో లాక్​డౌన్, మెట్​పల్లిలో లాక్​డౌన్

కరోనా ఉద్ధృతిని తగ్గించేందుకు ప్రభుత్వం విధించిన లాక్​డౌన్​ను పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. జగిత్యాల జిల్లా మెట్​పల్లి, కోరుట్ల పట్టణాల్లో లాక్​డౌన్​ పటినష్ఠంగా అమలవుతోంది. ఉదయం 10 గంటలు దాటిన తర్వాత అనుమతుల్లేని వాహనాలను పోలీసులు సీజ్ చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రధాన కూడలి వద్ద చెక్​పోస్ట్ ఏర్పాటు చేసి వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారిని హెచ్చరిస్తూ వాహనాలను సీజ్ చేసి తగిన జరిమానా విధిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకే దుకాణాలు మూసి వేయాలని, ప్రజలెవరూ బయటకు రావద్దని ప్రత్యేక వాహనాల ద్వారా పట్టణాల్లో ప్రచారం చేస్తున్నారు. లాక్​డౌన్ సమయంలో అనుమతి లేకుండా తెరిచి ఉంచిన దుకాణాలకు మున్సిపల్ అధికారులు జరిమానా విధిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details