ఎన్నిక ఏదైనా ప్రజలు ఉద్యమపార్టీ తెరాస వెంటే ఉంటారని నాగార్జున సాగర్ ఎన్నికల్లో నిరూపితమైందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఇప్పటికైనా ప్రతి పక్షాలు విమర్శలు మానుకోవాలని హితవు పలికారు. చౌకబారు విమర్శలు చేసినా.. ఇష్టానుసారం మాట్లాడినా ప్రజలు బ్యాలెట్‌తో సమాధానం చెప్పారని తెలిపారు.
ఎన్నికలేవైనా.. గెలుపు తెరాసదే: ఎమ్మెల్యే సంజయ్
ఎన్నికలేవైనా గెలుపు తెరాసదేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో గులాబీకి మరోసారి పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఘనవిజయం సాధించిన నోముల భగత్‌కు శుభాకాంక్షలు చెప్పారు.
కాంగ్రెస్, భాజపాకు చెందిన కేంద్ర నాయకులు ప్రచారం నిర్వహించినా..సంక్షేమ సర్కారునే ఆదరించారని సంజయ్ అన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్, భాజపా కళ్లు తెరవాలని అన్నారు. జగిత్యాల మున్సిపాలిటీలో మాస్టర్ ప్లాన్ లేక పట్టణం ఛిన్నాభిన్నం అయ్యిందని నిత్యం విమర్శలు చేసే జీవన్ రెడ్డి ఆత్మవిమర్శ చేసుకోవాలని సంజయ్ అన్నారు. భాజపా ఎంపీలు బండి సంజయ్, ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెప్పించాలని డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్‌లో తెరాసకు పట్టం కట్టిన ప్రజలకు, గెలుపొందిన నోముల భగత్‌కు అభినందనలు తెలిపారు.
- ఇదీ చూడండి:బతికుండగానే మోసుకెళ్లాల్సిన పరిస్థితి...