సూక్ష్మ కళలో నిష్ణాతుడైన జగిత్యాలకు చెందిన గుర్రం దయాకర్ తన ప్రతిభను మరోసారి చాటుకున్నాడు. ప్రతిసారి ఏదో ప్రత్యేకతో కూడిన సూక్ష్మ కళాకృతులను తయారు చేసే దయాకర్.. గాంధీ జయంతిని పురస్కరించుకుని 0.27 మిల్లీ మీటర్ల బంగారంతో గుండు పిన్నుపై ఇమిడే మహాత్ముని బొమ్మను తీర్చిదిద్దాడు.
గుండు పిన్నుపై బంగారంతో మహాత్ముని ప్రతిమ - jagtial miniature artist gurram dayakar
సూక్ష్మ కళ ఎంతో కష్టమైన కళ. అతి చిన్న వస్తువులపై కళాఖండాలను చెక్కాలంటే ఎంతో ప్రతిభ, మరెంతో సహనం అవసరం. అలాంటి అతి కష్టమైన సూక్ష్మకళలో నిష్ణాతుడు.. జగిత్యాలకు చెందిన గుర్రం దయాకర్. గాంధీ జయంతిని పురస్కరించుకుని గుండు పిన్నుపై బంగారంతో మహాత్ముని బొమ్మను తీర్చిదిద్దాడు.
గుండు పిన్నుపై బంగారంతో మహాత్ముని ప్రతిమ
ఇది తయారు చేసేందుకు 12 గంటల సమయం పట్టిందని దయాకర్ తెలిపాడు. గుండు పిన్నుపై సూక్ష్మరూపంలో ఉన్న మహాత్ముని బొమ్మ ఆకర్షణీయంగా ఉంది.
Last Updated : Oct 1, 2020, 8:05 PM IST