తెలంగాణ

telangana

ETV Bharat / state

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం - ధాన్యం కొనుగోలు

జగిత్యాల జిల్లాలో వానాకాలం సీజన్​లో ఏడు లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం 400 కొనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు జగిత్యాల జిల్లా గుగులోత్​ రవి అన్నారు. జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

Jagtial Collector Review Meeting On Paddy Purchase
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై కలెక్టర్‌ సమీక్షా సమావేశం

By

Published : Oct 20, 2020, 8:36 PM IST

జగిత్యాల జిల్లాలో ఈ వానాకాల సీజన్‌లో ఏడు లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని.. ఇందుకోసం 400 కోనుగోళ్లు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు జగిత్యాల జిల్లా కలెక్టర్‌ గుగులోత్​ రవి అన్నారు. జిల్లాలో వరి కోతలు మొదలు కానున్న నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో టార్ఫాలిన్​ షీట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. హమాలీలను సిద్ధంగా ఉంచుకోవాలని.. రవాణా సమస్యలు తలెత్తకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు.

ఇవీ చూడండి:విరాళాల వెల్లువలు... ఆపదలో సినీ ప్రముఖుల ఆపన్నహస్తం

ABOUT THE AUTHOR

...view details