ఉద్యోగి తండ్రికి కరోనా లక్షణాలు..బ్యాంక్ మూసేసిన అధికారులు - corona new cases
కరోనా లక్షణాలు కన్పించిన ఓ వ్యక్తిని జగిత్యాల జిల్లా గొల్లపల్లి వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుమారుడు పని చేసే బ్యాంకును సైతం అధికారులు మూసేసి... సిబ్బందిని క్వారంటైన్ చేశారు.
కరోనా లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన ఓ వ్యక్తి
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు కన్పించగా... వైద్యులు అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అతని కుమారుడు ధర్మపురిలోని ఓ బ్యాంకులో పని చేస్తుండటం వల్ల ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బ్యాంకుకు తాళం వేశారు. అందులో పని చేస్తున్న 12 మంది సిబ్బందిని క్వారంటైన్లో ఉండాలని అధికారులు ఆదేశించారు. బ్యాంకు పరిసర ప్రాంతాల్లో అధికారులు శానిటైజ్ చేయించారు.