తెలంగాణ

telangana

ETV Bharat / state

సొంత డబ్బులతో మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేసిన సర్పంచ్

కరోనాను ఎదుర్కొనేందుకు సొంత డబ్బులు ఖర్చు చేస్తూ జగిత్యాల జిల్లా కొండాపూర్ సర్పంచ్ సామంతుల ప్రభాకర్ ఆదర్శంగా నిలుస్తున్నారు. సొంత ఖర్చులతో గ్రామంలో అందరికి శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేస్తున్నారు. కరోనా బారిన పడకుండా భౌతిక దూరాన్ని తప్పనిసరి పాటించాలని సూచించారు.

kondapur Sarpanch
kondapur Sarpanch

By

Published : Jul 6, 2020, 10:53 PM IST

జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం కొండాపూర్ సర్పంచ్ సామంతుల ప్రభాకర్ కరోనాను ఎదుర్కొనేందుకు స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. సొంతగా రూ.లక్షా 10వేలతో మాస్కులు, సానిటైజర్ కొనుగోలు చేశారు. ఇంటింటికి తిరిగి ప్రతి కుటుంబానికి రెండు మాస్కులు, ఒక సానిటైజర్ బాటిల్ అందజేశారు. కరోనా బారిన పడకుండా భౌతిక దూరాన్ని తప్పనిసరి పాటించాలని తెలియజేశారు.

కొండాపూర్ గ్రామాన్ని కరోనా రహిత గ్రామంగా నిలిపేందుకు గ్రామస్థుల పాత్ర కీలకమని ప్రచారం చేశారు. గత వారం సమీప గ్రామంలో వలస కార్మికుని నుంచి మరొకరికి కరోనా సోకిన ఉదంతంతో స్వచ్ఛంద లాక్ డౌన్ పాటించారు. దీనితో కొండాపూర్ సర్పంచ్ ఒక అడుగు ముందుకు వేసి సొంత ఖర్చులతో మాస్కులు, సానిటైజర్లు పంపిణీ చేశారు.

ఇదీ చదవండి:20-20-20 సీక్రెట్ గురించి మీకు తెలుసా?

ABOUT THE AUTHOR

...view details