తెలంగాణ

telangana

ETV Bharat / state

'కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం'

పేదల ఇళ్లలో ఆడపిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్​ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశ పెట్టారని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లాలోని పలు గ్రామాల్లో అర్హులైన వారికి కల్యాణ లక్ష్మి చెక్కులకు ఆయన పంపిణీ చేశారు.

jagitial-mla-snajay-kumar-distribute-kalyana-lakshmi-shadi-mubarak-cheqes-in-sarangapur
'కల్యాణ లక్ష్మి పథకం పేదలకు వరం'

By

Published : Jan 21, 2021, 11:55 AM IST

కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు పేదల కుటుంబాలకు వరంగా మారాయని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ అన్నారు. జిల్లాలోని సారంగపూర్‌ మండల పరిధిలో గల పలు గ్రామాల్లోని 19 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

పేదల ఇళ్లలో ఆడ పిల్ల పెళ్లి భారం కాకూడదనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్​ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను ప్రవేశ పెట్టారని ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, తెరాస నాయకులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:'పీఆర్‌సీపై వారంలోనే నిర్ణయం తీసుకోవాలి'

ABOUT THE AUTHOR

...view details