జగిత్యాల జిల్లా బీర్‌పూర్ ఎస్‌ఐ శంకర్‌నాయక్‌పై హోంగార్డు గజ్జల జనార్దన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు. విధులు నిర్వహిస్తున్న తనను ఎస్‌ఐ శంకర్ నాయక్ కొట్టాడని, ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. మే 6న తేదీన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో అందరి ముందు తనను అనవసరంగా కొట్టాడని వాపోయాడు. ఈ విషయంపై సీఐ, డీఎస్పీ, ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవటంలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చిరుద్యోగులు చిన్న తప్పు చేస్తేనే సస్పెండ్ చేసే ఉన్నతాధికారులు, పెద్ద వారు తప్పు చేస్తే పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. జిల్లా పాలనాధికారైన తనకు న్యాయం చేయాలని బాధిత హోంగార్డు గజ్జల జనార్దన్ ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఎస్ఐపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన హోంగార్డు - SI
విధులు నిర్వహిస్తున్న తనపై ఎస్‌ఐ శంకర్ నాయక్ అనవసరంగా చేయిచేసుకున్నారని హోంగార్డు గజ్జల జనార్దన్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఎస్ఐపై ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన హోంగార్డు