తెలంగాణ

telangana

ETV Bharat / state

పసుపు రైతుల ఎన్నికల పోరాటం..! - PASUPU RAITHULA DHARNA

వారేం రాజకీయ నాయకులు కాదు. కానీ పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు. ఏకంగా వెయ్యి మందికి పైగా ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. గెలుపోటములు ముఖ్యం కాదంటున్నారు. తమ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకుపోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

కవితకు పోటీగా వెయ్యి మంది రైతులు..!

By

Published : Mar 15, 2019, 1:39 PM IST

Updated : Mar 15, 2019, 4:35 PM IST

కవితకు పోటీగా వెయ్యి మంది రైతులు..!
రాజకీయాల్లోకి రావాలంటే సమాజ సేవ పైన ఆసక్తి, దేశాన్ని బాగుచేయాలనే కాంక్ష ఉండాలి. కానీ వీరు తమకి వచ్చిన కష్టాలను నలుగురికి తెలియజెప్పడానికి రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. గ్రామానికి ఇద్దరు చొప్పున ఎంపీగా పోటీ చేయాలని తీర్మానం చేసుకున్నారు. వారెవరు, వారికేం కష్టమొచ్చింది? ఎందుకు పోటీ చేయబోతున్నారు అనుకుంటున్నారా..? అయితే స్టోరీ చదవాల్సిందే.

గత కొంతకాలంగా నిజామాబాద్, జగిత్యాల పసుపు రైతులు మద్దతు ధర కోసం ఆందోళన బాట పట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు పెట్టుబడి కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపు పండించడానికి ఎకరాకి లక్ష నుంచి లక్షా ఇరవై వేల రూపాయల వరకు పెట్టుబడి పెడుతున్నారు. దానికి తోడు 9 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు. ఇంతచేసినా పెట్టుబడి రావట్లేదు. గత పదేళ్ల క్రితం క్వింటాల్​​ పసుపు ధర 10 వేలుంటే ప్రస్తుతం 4500 నుంచి 5 వేలు మాత్రమే. ఓ వైపు విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చుల పెరిగిపోతుంటే మద్దతు ధర మాత్రం కిందకి పడిపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామానికి ఇద్దరు చొప్పున పోటీ..!

పసుపు ధర కనీసం పది వేలుంటే తప్ప తమకి గిట్టుబాటు కాదని, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని గత కొన్నాళ్లుగా రైతులు కోరుతున్నారు. అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదని రైతన్నలు ఏకమై... తమ బాధని కేవలం రాష్ట్ర ప్రభుత్వానికే కాకుండా దేశమంతా తెలిసేలా చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా గ్రామానికి ఇద్దరు చొప్పున ఎంపీగా పోటి చేయాలని నిర్ణయించుకున్నారు జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్​ రైతులు.

లోక్​సభ బరిలో లక్ష్మీపూర్ రైతులు..!

లక్ష్మీపూర్‌ రైతులంతా సమావేశమై వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని తీర్మానం చేసుకున్నారు. రైతు సంఘం ఆధ్వర్యంలో ఎంపీగా పోటీ చేసేందుకయ్యో ఖర్చును కర్షకులే భరించాలని నిర్ణయించారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని చెబుతున్నారు. కేవలం తమ నిరసనని అందిరికీ తెలిసేలా చేయాలనే బరిలోకి దిగుతున్నట్లు వెల్లడించారు. నోటిఫికేషన్‌ వచ్చే సమయానికి రెండు జిల్లాల పరిధిలోని రైతులంతా ఏకమై నిజామాబాద్‌ పార్లమెంటు సీటుకు దాదాపు వెయ్యి మంది పోటి చేసేలా కసరత్తు చేస్తున్నారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు రైతులు తీసుకున్న ఈ నిర్ణయం... అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇవీ చదవండి:నెలనెలా ఖాతాలో డబ్బులేస్తారట!

Last Updated : Mar 15, 2019, 4:35 PM IST

ABOUT THE AUTHOR

...view details