తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Dec 12, 2023, 7:39 PM IST

ETV Bharat / state

సొంతిళ్లు లేదని ప్రభుత్వ స్థలంలో గుడిసెలు - హామీ ఇచ్చేదాక కదిలేది లేదంటున్న స్థానికులు

Illegal House Construction in Jagtial : గూడుకోసం పేదలు తరలి వచ్చి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఆరు వేలకుపైగా చీరలతోనే గుడిసెలు వేసుకొని ప్రభుత్వ స్థలాన్ని తమ సొంతం చేసుకునేందుకు యత్నిస్తున్నారు. జగిత్యాల పట్టణం సమీపంలోని టీఆర్‌నగర్‌, రాజారం శివారులోని ప్రభుత్వం భూమిలో గుడిసెలను ఏర్పాటు చేసుకుంటుండగా రోజు రోజుకు ఈ సంఖ్య మరింత పెరిగిపోతోంది.

CPM Protest For Houses For Poor in Jagtial
Illegal House Construction in Jagtial

Illegal Huts Construction in Jagtial :గత కొద్దిరోజులుగా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీపీఐఎం ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్నారు. జగిత్యాల పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌, రాజారం శివారులోని గుట్ట వద్ద దాదాపు 200 నుంచి 300 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిలో సీపీఐఎం జెండాలు పాతి పేదలను గుడిసెలు వేసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇళ్లస్థలాలు ఇస్తున్న విషయం తెలుసుకున్న పేదలు జగిత్యాల, కరీంనగర్‌, సిరిసిల్ల, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల నుంచి భారీగా తరలి వచ్చి గుడిసెలు వేసుకుని స్థలాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

People Protest against Police : గుడిసెలు తొలగించాలని గొడవ.. ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటూ ధర్నా..

గత రెండు నెలలుగా గుడిసెలు వేసుకుంటుండగా గత వారంరోజులుగా జనం భారీగా తరలి వస్తున్నారు. ఆటోలు, ఆర్టీసీ బస్సుల్లో తరలి వస్తున్నారు. వేలాది మంది తరలి రావటంతో రాజారం శివారు గుట్ట జనంతో నిండిపోయింది. కొందరు అక్కడే రాత్రి కూడా ఉంటుండగా, మరికొందరు రోజంతా అక్కడే ఉండి రాత్రి ఇంటికి వెళుతున్నారు.

నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని ధర్నా

CPM Protest For Houses For Poor in Jagtial:గత ప్రభుత్వం తమకు ఇళ్లు ఇవ్వలేదని గూడు లేకనే వచ్చి ఇక్కడ గుడిసెలు వేసుకుని ఉంటున్నామని అంటున్నారు. తమకు ఎలాంటి ఆధారం లేదని ప్రభుత్వం తమ వివరాలు సేకరించి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఆధారుల కార్డులు పట్టుకుని స్థలం వద్దకు చేరుకుంటున్నవారితో సందడి నెలకొంది. హోటళ్లు కూడా వెలిచాయి. రాత్రి విద్యుత్‌ కనెక్షన్‌ లేకపోయినా, సౌకర్యాలు లేకపోయినా రాత్రి కూడా చిన్న పిల్లలతో కలిసి అక్కడే గడుపుతున్నారు. ప్రభుత్వం ఏదైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నారన్న సమాచారంతో రోజురోజుకు రద్దీ పెరగనుండటంతో అధికారులు వారికి ఒక హామీలాంటిది ఇస్తే బాగుంటుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

తమ ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరుతూ దీక్ష

"ఏమీ లేని నిరుపేదలం అందుకే ఇక్కడ గుడిసేలు వేసుకొని ఉంటున్నాం. నాభర్త మరణించాడు నాకు ఒక కూతురు పని చేస్తేనే పూట గడుస్తది. రెంటు కట్టుకుంటూ జీవనం సాగించాలి అంటే చాలా కష్టంగా ఉంది. సీపీఎం అన్నలు చెప్పినట్లు వింటాం మాకు ఏంలేకే ఇక్కడికి వచ్చాము. మాకు సొంతిళ్లు ఇచ్చే వరకు ఇక్కడే ఉండి పోరాటం చేస్తాం." - స్థానికులు

నిర్మల్​లో తమ స్థలాలు ఆక్రమించారంటూ ఆందోళన

కూలీకి వెళ్తే కానీ పూట గడవని తమకు సొంత ఇళ్లు లేక రెంటుకు తీసుకుంటే చేసిన కష్టమంతా కట్టాడానికే పోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలోడబుల్‌బెడ్‌ రూంలు ఇస్తామన్న మాట అలాగే ఉండి పోయిందని వాపోతున్నారు. ప్రభుత్వం తమ ఇళ్లకు స్థలం కేటాయించే వరకు తమ పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.

Illegal House Construction in Jagtial

ఇళ్లు, స్థలాలు ఇవ్వాలని పేదల సంఘం ఆందోళన

ABOUT THE AUTHOR

...view details