జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలోని గుట్ట సమీపంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులందరినీ హుటాహుటిన జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కూలీలకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులు ఆదేశించారు.
ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి - కూలీలపై తేనెటీగలు దాడి
జగిత్యాల జిల్లాలోని మల్యాలలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. సుమారు 10 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. బాధితులందరినీ జగిత్యాల జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
జగిత్యాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలు