గ్రామంలో గెజిట్ ప్రకారం సరిహద్దులు నిర్ణయించకపోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయని... జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గోవిందుపల్లె గ్రామస్థులు అన్నారు. తమ గ్రామ పరిధిలోని చెరువులు, కుంటలు, పరిపాలనా నిర్వహణ అంశాల్లో ఇబ్బందులను పరిష్కరించాలని రెండు రోజులుగా ఆందోళన చేపట్టారు.
'గ్రామ సరిహద్దులు నిర్ణయించి సమస్యలు పరిష్కరించండి'
గెజిట్ ప్రకారం గ్రామ సరిహద్దులు నిర్ణయించి తమ సమస్యలు పరిష్కరించాలని... జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గోవిందుపల్లె గ్రామస్థులు రెండు రోజులుగా ఆందోళన చేపట్టారు. రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి సమస్యను వివరించారు.
'గ్రామ సరిహద్దులు నిర్ణయించి సమస్యలు పరిష్కరించండి'
దాదాపు 300 మంది గ్రామస్థులు రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన మంత్రి... అక్కడే ఉన్న అదనపు పాలనాధికారి రాజేశంను గ్రామానికి వెళ్లి సర్వే నిర్వహించాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: హిరేన్ మృతదేహం లభించిన ప్రదేశంలో మరో శవం