జగిత్యాల జిల్లా రాంపూర్ రివర్స్ పంప్ నుంచి గోదావరి జలాలను మెట్పల్లి మండలం జగ్గాసాగర్కు తరలించారు. తెరాస కార్యకర్తలు, రైతులు వరద కాలువ వద్దకు చేరుకుని గేట్ల వద్ద సంబరాలు జరుపుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గోదావరి జలాలతోపాటు క్షీరాభిషేకం చేశారు. మిఠాయి పంచిపెట్టారు. నీరు రావడం పట్ల అన్నదాతలు ఆనందాన్ని వ్యక్తం చేశారు.
జగ్గాసాగర్ చేరుకున్న కాళేశ్వరం జలాలు
రివర్స్ పంపింగ్ ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి పోచంపాడుకు గోదావరి జలాలు తీసుకెళ్లడంలో ముందడుగు పడింది. జగిత్యాల జిల్లా రాంపూర్ రివర్స్ పంప్ నుంచి మెట్పల్లి మండలం జగ్గాసాగర్కు నీరు చేరుకుంది.
పూజలు చేస్తున్న గ్రామస్థులు