మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలంటూ అన్నదాతలు రోడ్డెక్కారు. జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులు మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో సమావేశం నిర్వహించారు. అనంతరం అక్కడి నుంచి జాతీయ రహదారిపై ర్యాలీగా తరలివచ్చి పాతబస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
మక్కలు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు - jagtial formers latest protest for corn
మక్కలు కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతన్నలు ధర్నా బాట పట్టారు. జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి సుమారు మూడు వేల మంది రైతులు తరలివచ్చి జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
మక్కలు కొనుగోలు చేయాలని రోడ్డెక్కిన అన్నదాతలు
ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలని రోడ్డుపై ధర్నాకు దిగారు. రోడ్డుపై వాహనాలు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. జిల్లా నుంచి సుమారు మూడు వేల మంది రైతులు తరలిరావడంతో జాతీయ రహదారి రైతులతో కిటకిటలాడింది.
ఇదీ చూడండి:రాగల రెండు రోజులపాటు మోస్తరు వర్షాలు