తెలంగాణ

telangana

ETV Bharat / state

మాజీ సైనికుడి భూమి లాక్కున్న అటవీ అధికారులు - Forest officials who seized the land of a former soldier

దేశం కోసం పని చేసిన ఓ సైనికుడికి ఇచ్చిన భూమిని తిరిగి లాక్కున్నారు ప్రభుత్వ అధికారులు. రెవెన్యూ అధికారులు ఆ భూమిని మాదంటారు. కాదు మాదంటారు అటవీ శాఖ వారు. ఈ వ్యవహారంతో కన్నీళ్ల పర్యంతమైన బాధితుడు జగిత్యాల జిల్లా ప్రజావాణిలో ఫిర్యాదు చేశాడు.

మాజీ సైనికుడి భూమి లాక్కున్న అటవీ అధికారులు

By

Published : Sep 17, 2019, 2:52 PM IST

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామపూర్​కు చెందిన ఇల్లూరి అరుణ్​కుమార్ 17 ఏళ్ళు సైన్యంలో పని చేశాడు. 2006లో పదవి విరమణ తర్వాత ప్రభుత్వం అతనికి అదే గ్రామంలో సర్వే నంబర్ 100/52 లో 2.20 ఎకరాల భూమిని ఇచ్చింది.

మాజీ సైనికుడి భూమి లాక్కున్న అటవీ అధికారులు

భూమికి సంబంధించిన పాసు పుస్తకం మీసేవలో కంప్యూటీకరించారు. ఆ విశ్రాంత సైనికోద్యోగి వ్యవసాయం కూడా చేసుకుంటున్నాడు. ఈ మధ్యే ఆ భూమి అటవీ శాఖకు చెందినదని అధికారులు లాక్కున్నారు. ఇచ్చినట్టే ఇచ్చి లాక్కున్నారని తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్​ను ప్రజావాణిలో బాధితుడు కోరాడు.

ఇదీ చూడండి :మోదీ పుట్టిన రోజున స్వర్ణ కిరీటం బహూకరణ

ABOUT THE AUTHOR

...view details