కలిసి చదువుకున్నారు. స్నేహంతో మెలిగారు. చదువులు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో చేరినా స్నేహాన్ని మరువక జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 1992-93 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు అందరు కలిసి నెలనెల ఓ చోట చేరి కష్టసుఖాలు పంచుకుంటారు. ఆ స్నేహితులలో కొంత మంది విదేశాలలో ఉపాధికి వెళ్లారు. వారిలో సాజిత్ అనే స్నేహితుడు దుబాయ్లో మరణించాడని విని తన కుటుంబానికి అన్నీ తామే అయ్యి రూ.35 వేలు సాజిత్ తల్లికి అందించారు. సాజిత్‌పైనే ఆధారపడి ఉన్న ఆ కుటుంబానికి మేమున్నామంటూ భరోసా కల్పించారు. స్నేహితులందరిని చూసిన ఆ తల్లి ఆవేదనకులోనై కంటతడి పెట్టడతంతో వారందరు ఆ తల్లిని ఓదార్చారు.
స్నేహితుని కుంటుంబానికి అండగా దోస్తులు - స్నేహితుల దినోత్సవం
స్నేహితుల దినోత్సవానికి నిజమైన అర్థం చెప్పారు జగిత్యాల జిల్లాలోని కొంత మంది దోస్తులు. కలిసి చదువుకున్నాము.. స్నేహంతో మెదిలాము.. అంతటితో అయిపోయింది కదా అని ఎవరిమానాన వారు వెళ్లి పోకుండా దూరదేశానికి వెళ్లి ఆకస్మికంగా మరణించిన మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచారు.
స్నేహితుని కుంటుంబానికి అండగా దోస్తులు
ఇదీ చూడండి:ట్రెండ్ మారినా...ఫ్రెండ్ మారడు!