మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని జగిత్యాల కలెక్టరేట్ ముందు రైతులు మహాధర్నా చేపట్టారు. అలాగే సన్న వరి రకాలకు రూ. 2,500 మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లాలో 144 సెక్షన్ అమలు చేసిన పోలీసులు రైతులు ఎవరు జిల్లా కేంద్రానికి రాకుండా మోహరించారు. ఇప్పటికే 200 మంది రైతు నాయకులను అరెస్ట్ చేశారు. జిల్లా పోలీసులతో పాటు వివిధ జిల్లాల నుంచి పోలీసులను రప్పించి భారీ భద్రత ఏర్పాటు చేశారు.
200 మంది రైతులను అరెస్టు చేసిన పోలీసులు - రైతుల ధర్నా వార్తలు జగిత్యాల
మక్కలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని.. సన్న వరి రకాలకు రూ. 2,500 మద్దతు ధర ఇవ్వాలని జగిత్యాలలో రైతులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ ముందు మహాధర్నా చేపట్టారు. అయితే పోలీసులు 144 సెక్షన్ విధించి.. రైతులను ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. దీనిపై రైతు ఐఖ్యవేదిక జిల్లా కన్వీనర్ బద్దం శ్రీనివాసరెడ్డి ఆగ్రహించారు.
200 మంది రైతులను అరెస్టు చేసిన పోలీసులు
తమ సమస్యల గురించి చెప్పడానికి ధర్నాకు పిలుపునిస్తే పోలీసులు ఎక్కడికక్కడా అరెస్టులు చేయడం దారుణమని రైతు ఐఖ్యవేదిక జిల్లా జిల్లా కన్వీనర్ బద్దం శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో రైతు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. వర్షాలకు పండిన పంటలు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.