జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోళ్ల జాప్యంతో రైతులు కష్టాలపాలవుతున్నారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యంను విక్రయించాలనే ఆశతో వచ్చిన అన్నదాతలకు కొనుగోళ్లు సరిగా లేక నిరాశే మిగులుతోంది. కొనుగోళ్ల కోసం వచ్చిన రైతులు నెల రోజుల నుంచి కుప్పల వద్ద పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తెచ్చిన ధాన్యానికి అధికారులు తేమ శాతం, వివిధ కారణాలు తెలుపుతూ అమ్మకాలను జాప్యం చేస్తున్నారని రైతులు ఆవేదన చెందారు.
గత ఐదు రోజుల నుంచి రాత్రి పూట అకాల వర్షాలు కురుస్తున్నాయని, ధాన్యం తడిసి ముద్దవుతుందని రైతులు వాపోయారు. మార్కెట్ యార్డులో మురుగు కాలువ కూడా లేకపోవడం వల్ల కురిసిన వర్షం ఎటూ వెళ్లకుండా కుప్పల వద్దే ఉంటుందని తెలిపారు. దీంతో ధాన్యం తడిసిపోతుందని అన్నదాతలు ఆవేదనకు లోనయ్యారు.