జగిత్యాల జిల్లాలో ఇద్దరు మరుగుజ్జుల వివాహం ఘనంగా జరిగింది. మెట్‌పల్లి పురపాలక కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్.. పెద్దపల్లి జిల్లాకు చెందిన స్వప్న ఆరా పేట శివాలయంలో వేద మంత్రాల సాక్షిగా ఒక్కటైయారు.
ఇద్దరు మరుగుజ్జులు ఒక్కటైన వేళ.. - మెట్‌పల్లి పురపాలక కార్యాలయం
జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలంలోని ఆరాపేట శివాలయంలో.. ఇద్దరు మరుగుజ్జుల వివాహం జరిగింది. వధువు, వరుడు ఇద్దరు మరుగుజ్జులు అయినందున ఈ వివాహం ప్రత్యేకత సంతరించుకుంది.
ఇద్దరు మరుగుజ్జులు ఒక్కటైన వేళ..
వధువు వరుడు మరుగుజ్జులు కావడంతో గ్రామంలో ఈ పెళ్లి అందరినీ ఆకట్టుకుంది. ఈ నూతన జంటను బంధుమిత్రులతో పాటు.. పలువురు ప్రముఖులు ఆశీర్వదించారు.
ఇదీ చదవండి:నిధుల విడుదలకు హరీశ్‌రావు హామీ: తలసాని