జగిత్యాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మల్యాలలో వరసగా రెండో రోజు 68 కరోనా కేసుల నిర్ధరణ అయ్యాయి. గురువారం 64 మంది వైరస్ బారిన పడ్డారు. రెండు రోజుల్లోనే 134 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మల్యాలలో కరోనా విజృంభణ.. రెండ్రోజుల్లో 134 కరోనా కేసులు నిర్ధరణ
జగిత్యాల జిల్లాలో కరోనా కోరలు చాస్తోంది. మల్యాల గ్రామంలో వరసగా రెండో రోజు ఎక్కువ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రోజు 195 పరీక్షలు నిర్వహించగా... 68మంది మహమ్మారి బారిన పడ్డారని వైద్యాధికారులు వెల్లడించారు. కొవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.
మల్యాలలో కరోనా కేసులు, మల్యాల కరోనా కేసులు
శుక్రవారం రోజు 195 పరీక్షలు నిర్వహించగా 68 కేసులు నిర్ధరణ అయ్యాయని వైద్యాధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వైద్యాధికారులతో కలెక్టర్ రవి సమీక్ష నిర్వహించారు. కరోనా పరీక్షలు పెంచి... నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. 45 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. అందరూ విధిగా మాస్క్ ధరించాలని కోరారు.
ఇదీ చదవండి:'టీకా ఉత్సవ్'పై అవగాహన తీసుకురావాలి: కిషన్ రెడ్డి