'తెరాసలో విలీనం చేయటాన్ని ఖండిస్తున్నాం' - adluri lakshman kumar
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేయటాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు.
కాంగ్రెస్ ఆందోళన
జగిత్యాల జిల్లాలో డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ధర్నాలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు నాయకులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనతో పోలీసులకు, కాంగ్రెస్ శ్రేణులకు తోపులాట చోటు చేసుకుంది. చివరకు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. తెరాస తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ నాయకులు ఖండించారు.