జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల విద్యుత్ శాఖ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చేందుకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఠాణాలోనే నిరసన..
ఫలితంగా పాత బస్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ధర్నా విరమించకపోవడం వల్ల జీవన్ రెడ్డి సహా నేతలను, శ్రేణులను అరెస్ట్ చేసి జగిత్యాల పట్టణ ఠాణాకు తరలించారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డి స్టేషన్లోనే నేలపై కూర్చొని ఆందోళన చేశారు. ఫలితంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు నచ్చజెప్పడం వల్ల నాయకులు ఆందోళన విరమించారు. అధిక విద్యుత్ చార్జీల పెంచిన ప్రభుత్వ తీరుపై జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యుత్ ఛార్జీల పెంపును నిరసించిన కాంగ్రెస్ ఇవీ చూడండి : ఇంధన ధరల పెంపుపై వెనక్కి తగ్గండి: సోనియా