కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యం వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లిలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జువ్వాడి కృష్ణారావుతో పాటు నాయకులు పరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల రోజులు గడుస్తున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల అన్నదాతలు ఇబ్బందులకు గురవుతున్నారని కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు అన్నారు.
'ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యం తగదు' - farmers
జగిత్యాల జిల్లా మేడిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వాడి కృష్ణారావుతో పాటు నాయకులు పరిశీలించారు. రైతుల ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నేతలు
ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తోందని కృష్ణారావు విమర్శించారు. క్షేత్రస్థాయిలో కర్షకులు ధాన్యం కొనుగోలు చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వదిలి.. ధాన్యం కొనుగోలు చేసి అన్నదాతకు అండగా నిలవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇవీ చూడండి:ఆర్థిక, వ్యవసాయ రంగాలపై మంత్రుల సమీక్ష