నిర్మల్ జిల్లా భైంసాలో గాయపడ్డ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్నారనే సమాచారం మేరకు జగిత్యాల జిల్లా వ్యాప్తంగా భాజపా నాయకులను ఎక్కడికక్కడా అదుపులోకి తీసుకున్నారు. మెట్పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్లో భాజపా నాయకులను అర్ధరాత్రి పూట ఇంటింటికి వెళ్లి అరెస్టులు చేశారు. అరెస్ట్ చేసిన నాయకులను ఆయా పోలీస్ స్టేషన్లకు తరలించారు.
జిల్లాలో ఎక్కడికక్కడ భాజపా నాయకుల అరెస్టులు - jagityal updates
జగిత్యాల జిల్లాలోని మెట్పల్లి, కోరుట్ల భాజపా నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. అర్థరాత్రి నుంచే ఎక్కడికక్కడా అదుపులోకి తీసుకొని పోలీస్స్టేషన్లకు తరలించారు.
bjp leaders arrest in jagityala
రాత్రి 11 గంటల నుంచి ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడాన్ని భాజపా శ్రేణులు ఖండించాయి. భైంసాలో దారుణమైన ఘటనలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులను పరామర్శించేందుకు వెళ్తే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం సరికాదన్నారు.