మొక్కులు చెల్లించుకుంటున్న భాజపా నేతలు - మొక్కులు చెల్లించుకుంటున్న భాజపా శ్రేణులు
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాజపా ఘన విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో నాలుగు స్థానాలను కైవసం చేసుకున్నందున జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పార్టీ నేతలు ఆంజనేయ స్వామికి మొక్కులు సమర్పించుకున్నారు.
మొక్కులు చెల్లించుకుంటున్న భాజపా శ్రేణులు
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో పాటు రాష్ట్రంలో నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో పార్టీ నేతలు ఆంజనేయ స్వామికి మొక్కులు సమర్పించుకున్నారు. పట్టణంలో శ్రీ స్వయంభు ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కొబ్బరికాయలు కొట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కమలాన్ని మరింత బలోపేతం చేస్తామని నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.