తెలంగాణ

telangana

ETV Bharat / state

'కోడిని అరెస్టు చేయలేదు... రక్షించేందుకే తీసుకొచ్చాం' - bet chicken arrest in jagityal

ఒక వ్యక్తి మరణించిన ఘటనలో కోడిని అరెస్ట్​ చేశారన్న వార్తలను పోలీసులు ఖండించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో కోడికి కత్తి కట్టే క్రమంలో ఓ వ్యక్తి మరణించగా... ఆ కోడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని వార్తలు ప్రచారం జరిగాయి. అయితే.. ఆ కోడిని సంరక్షించేందుకే ఠాణాకు తీసుకొచ్చామని పోలీసులు చెబుతున్నారు.

'కోడిని అరెస్టు చేయలేదు... రక్షించేందుకే తీసుకొచ్చాం'
'కోడిని అరెస్టు చేయలేదు... రక్షించేందుకే తీసుకొచ్చాం'

By

Published : Feb 26, 2021, 12:38 PM IST

Updated : Feb 26, 2021, 5:32 PM IST

ఇటీవలే ప్రమాదవశాత్తు కోడి కత్తి.. ఓ వ్యక్తి మర్మాంగాలకు తగిలి మరణించిన ఘటనలో కోడిని అరెస్ట్​ చేశారనే వార్తల్లో నిజం లేదని జగిత్యాల జిల్లా గొల్లపల్లి ఎస్సై జీవన్​ వెల్లడించారు. హత్యకు కారణమైన కోడిని ఎవరూ ఏమీ చేయకూడదన్న ఉద్దేశంతోనే ఠాణాకు తీసుకెళ్లి సంరక్షించినట్లు తెలిపారు.

ఏం జరిగిందంటే...

ఇటీవలే లొత్తునూర్‌ శివారులో కోడి పందెం నిర్వహించడానికి స్థానికులు సిద్ధమయ్యారు. వెల్గటూరు మండలం కొండాపూర్‌కు చెందిన తనుగుల సతీశ్‌ (45) ఈ పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా... కోడి కాలికి కత్తి కట్టేటప్పుడు అది తప్పించుకునేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ కత్తి... సతీశ్​ పురుషాంగానికి, వృషణాలకు తగలగా అక్కడే కుప్పకూలాడు. అక్కడున్న వారు వెంటనే స్పందించి క్షతగాత్రున్ని జగిత్యాల ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా... మార్గ మధ్యలోనే సతీశ్​ మృతి చెందాడు.

అరెస్ట్​ చేయలేదు...

ఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేశారు. సతీశ్​ మరణించడానికి సదరు కోడి కారణమని తేల్చారు. దర్యాప్తులో భాగంగా ఆ కోడిని సంరక్షించే బాధ్యత పోలీసులు తీసుకున్నారు. అందులో భాగంగానే సదరు కోడిని కోళ్ల పారంలో అప్పగించారు. అంతేకాని కోడిని అరెస్ట్ చేయడం కానీ, అదుపులోకి తీసుకోవడం కాని జరగలేదని పోలీసులు తెలిపారు.

'కోడిని అరెస్టు చేయలేదు... రక్షించేందుకే తీసుకొచ్చాం'

సంబంధిత కథనం:మర్మాంగాలకు కోడి కత్తి తగలడంతో వ్యక్తి మృతి

Last Updated : Feb 26, 2021, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details