జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని కళాశాలల్లో ముందస్తు బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని విద్యార్థులు వివిధ రకాల పూలను సేకరించి అందంగా బతుకమ్మను తయారు చేశారు. కొందరు విద్యార్థినులు శివలింగం ఆకారంలో బతుకమ్మను తయారుచేసి ఉపాధ్యాయుల ప్రశంసలు అందుకున్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో బతుకమ్మలను ఒకచోట పెట్టి వాటి చుట్టూ తిరుగుతూ కోలాటాలు ఆడుతూ అందరిని ఆకట్టుకున్నారు.
ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు - BATHUKAMMA_VEDUKALU
జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముందస్తు బతుకమ్మ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి.
ఘనంగా ముందస్తు బతుకమ్మ వేడుకలు