తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా మృతుడికి అంబులెన్స్‌ సిబ్బంది అంత్యక్రియలు - Ambulance crew funeral for those who died with Corona at metpally

మెట్​పల్లిలో కరోనాతో చనిపోయినవారికి అంబులెన్స్‌ సిబ్బంది అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. వారం రోజులుగా చికిత్స పొందుతూ పట్టణవాసి చనిపోయారు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేశారు.

Ambulance crew funeral for those who died with Corona
కరోనాతో చనిపోయినవారికి అంబులెన్స్‌ సిబ్బంది అంత్యక్రియలు

By

Published : Apr 10, 2021, 1:01 PM IST

కరోనాతో మరణించినవారికి... జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో అంబులెన్స్‌ నిర్వహకులు అంత్యక్రియలు నిర్వహించి... ఆదర్శంగా నిలుస్తున్నారు. పట్టణంలోని దుబ్బవాడకు చెందిన మత్స్యకారుడు... వారం రోజులుగా కరోనాకు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

అంత్యక్రియలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో... కుటుంబసభ్యులు రాయల్‌ అంబులెన్స్‌ నిర్వహకులను ఆశ్రయించారు. వైద్యుల అనుమతితో మృతదేహాన్ని తీసుకొచ్చిన అంబులెన్స్‌ సిబ్బంది... సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తిచేశారు.

ఇదీ చదవండి:కుమారులు పట్టించుకోవడం లేదని తల్లిదండ్రులు ఆత్మహత్య!

ABOUT THE AUTHOR

...view details