కరోనా లక్షణాలతో గాంధీలో చేరిన జగిత్యాలవాసి - corona ward in gandhi hospital
రాష్ట్రంలో కరోనా లక్షణాలతో ఓ వ్యక్తి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో చేరారు. జగిత్యాల జిల్లా గోపులాపూరానికి చెందిన ఓ వ్యక్తి జలుబు, తగ్గు, జ్వరం రావడం వల్ల ముందు జాగ్రత్తగా హైదరాబాద్కు తరలించారు.
కరోనా లక్షణాలతో గాంధీలో చేరిన వ్యక్తి
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం గోపులాపూరానికి చెందిన ఓ వ్యక్తికి జలుబు, తగ్గు, జ్వరం వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే కరోనా లక్షణాలు లాగా ఉన్నాయని వైద్యులు నిర్థారించారు. హైదరాబాద్ వెళ్లాలని సూచించారు. అతన్ని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి తరలించారు. కరోనా లక్షణాలున్న ఇతను 10రోజుల క్రితం దుబాయి నుంచి వచ్చారు.
Last Updated : Mar 14, 2020, 3:38 PM IST